: హుదూద్ ను జాతీయ విపత్తుగా ప్రకటించండి: సీపీఎం జాతీయ కార్యదర్శి కారత్
ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టించిన హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. ఆదివారం విశాఖలో పర్యటించిన ఆయన తుపాను వల్ల దెబ్బతిన్న పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హుదూద్ తుపాను ముందస్తు హెచ్చరికలను అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.