: హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం: తెలంగాణ సీఎం కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మరోమారు కాంగ్రెస్, టీడీపీలపై ఒంటికాలిపై లేచారు. హైదరాబాద్ లో నీటి కొరతకు కాంగ్రెస్, టీడీపీలే కారణమని ఆయన ఆదివారం ఆరోపించారు. ఆ రెండు పార్టీలు గతంలో వ్యవహరించిన తీరు కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మాయలో పడిపోయిందని ఆరోపించారు. తెలంగాణకు చంద్రబాబు కరెంట్ ఇవ్వడం లేదన్నారు. కృష్ణా జలాలపై ఆధిపత్యం చెలాయించేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News