: హర్యానా భూ దందాలో సోనియా అల్లుడికి రూ.44 కోట్ల లబ్ధి: కాగ్


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా, హర్యానా భూదందాతో రూ.44 కోట్ల మేర ఆయాచిత లబ్ధి పొందారు. ఈ మేరకు భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిగ్గు తేల్చింది. భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చక్రం తిప్పిన వాద్రా, అతి స్వల్ప కాలంలోనే అత్యధిక మొత్తంలో లాభాలు జేబులో వేసుకున్నారని కాగ్ నివేదిక తేల్చింది. ప్రభుత్వం నుంచి అభివృద్ది పేరిట కారు చౌకగా భూమిని తీసుకున్న వాద్రా సంస్థ 'స్కైలైట్', సదరు భూమిని డీఎల్ఎఫ్ సంస్థకు రూ.58 కోట్లకు విక్రయించింది. అయితే ఇందులో వాద్రా కంపెనీ కేవలం రూ.2.15 కోట్లను మాత్రమే తీసుకునే అవకాశముంది. మిగిలిన సొమ్మంతా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సి ఉంది. సదరు భూమి అభివృద్ధి కోసం కేవలం 14 కోట్లు మాత్రమే వెచ్చించిన వాద్రా, అమ్మేయగా వచ్చిన మొత్తంలో మెజారిటీ వాటాను దక్కించుకున్నారని కాగ్ తన నివేదికలో తేల్చింది.

  • Loading...

More Telugu News