: స్వచ్ఛ భారత్ లో లోక్ సత్తా జేపీ!


లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆదివారం స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. 2009లో ఆయన కూకట్ పల్లి నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ బరి నుంచి తప్పుకుని మల్కాజిగిరి లోస్ సభ నుంచి పోటికి దిగి ఓటమిపాలయ్యారు. దేశంలో చేపట్టాల్సిన కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్ మొదటిదని, అయితే చాలా ఆలస్యంగానైనా ఈ కార్యక్రమం పట్టాలెక్కడం ఆహ్వానించదగ్గదేనన్నారు. తన స్వగ్రామంలో 431 మరుగుదొడ్లను నిర్మించానని ఆయన చెప్పారు. స్వచ్ఛ భారత్ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీకి తాను పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని జేపీ తెలిపారు.

  • Loading...

More Telugu News