: నేడు ఎర్రన్నాయుడి రెండో వర్ధంతి


టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు రెండో వర్ధంతి నేడు శ్రీకాకుళం జిల్లాలోని ఆయన స్వగ్రామం నిమ్మాడలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు చేసింది. ఎర్రన్నాయుడు కొడుకు, ఎంపీ రాంమోహన్ నాయుడు, సోదరుడు, ఏపీ మంత్రి అచ్చన్నాయుడుల నేతృత్వంలో జరగనున్న ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద జరిగే కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మంత్రులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పిస్తారు.

  • Loading...

More Telugu News