: ప్రతి పల్లెకు పక్కా రోడ్డు...రూ. 5 వేల కోట్ల కేటాయింపు: కేసీఆర్
రాష్ట్రంలో ప్రతి పల్లెకు పక్కాగా రహదారిని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. ఇందుకోసం రూ. 5 వేల కోట్లను కేటాయించనున్నామని ఆయన పేర్కొన్నారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాలకు పక్కాగా రహదారులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని శనివారం నాటి పంచాయతీ రాజ్ రహదారుల సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డారు. రానున్న రెండేళ్లలోనే రోడ్ల మరమ్మతుల కోసం రూ.2,400 కోట్లను ఖర్చు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,641 గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదని, రానున్న కాలంలో రాష్ట్రంలో రోడ్డు మార్గం లేని పల్లె అంటూ ఉండదని ఆయన చెప్పారు.