: ఘోర ప్రమాదం...ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన టవేరా... ఏడుగురు మృతి
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దెందులూరు చెక్ పోస్టు వద్ద ఆగి ఉన్న లారీని టవేరా వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది.