: 300 కోట్ల క్లబ్బులో 'హ్యాపీ న్యూ ఇయర్'
షారూఖ్, అభిషేక్, దీపిక, బోమన్ ఇరానీ, సోనూ సూద్ వంటి భారీ తారాగణం నటించిన 'హ్యాపీ న్యూ ఇయర్' సినిమా రికార్డు నమోదు చేసింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కలెక్షన్లు నెమ్మదించినప్పటికీ, 300 కోట్ల క్లబ్బులో త్వరగానే చేరింది. గత తొమ్మిది రోజుల్లో ఈ సినిమా, ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. షారూఖ్ కు భారీ సంఖ్యలో అభిమానులున్న స్వదేశంలో 237 కోట్ల రూపాయలను వసూలు చేయగా, విదేశాల్లో 63 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో 'చెన్నై ఎక్స్ ప్రెస్' తరువాత షారుఖ్ ఖాన్ సినిమాల్లో 300 కోట్ల క్లబ్బులో చేరిన రెండో సినిమాగా 'హ్యాపీ న్యూ ఇయర్' వినుతికెక్కింది.