: రాళ్లతో కొట్టి చంపి, శవాన్ని పీక్కుతిన్నారు!


ఆఫ్రికాలోని కాంగోలో కొందరు వ్యక్తులు ఓ యువకుడిని రాళ్ళతో కొట్టి చంపి, అతడి శవాన్ని పీక్కుతిన్న విషయం వింటే ఒళ్ళు జలదరించకమానదు. ఘటన వివరాల్లోకెళితే... కాంగో ఈశాన్య ప్రాంతంలోని బేని పట్టణంలో శుక్రవారం ఓ బస్సులో కత్తితో ప్రయాణిస్తున్న యువకుడిని స్థానికులు పట్టుకున్నారు. అతడిని ఏడీఎఫ్-ఎన్ఏయూఎల్ మిలిటెంట్ గా అనుమానించి, రాళ్ళతో కొట్టి చంపారు. అనంతరం, అతడి శవాన్ని కాల్చి, మాంసాన్ని పీక్కుతిన్నారు. ఉగాండాకు చెందిన ఏడీఎఫ్ ఇస్లామిక్ మిలిటెంట్లకు, కాంగో పౌరులకు మధ్య ఘర్షణలు జరుగుతుంటాయి. ఇటీవల ఏడీఎఫ్ మిలిటెంట్లు కాంగో సరిహద్దు ప్రాంతాల్లో దాడిచేసి 100 మంది కాంగో పౌరులను పొట్టనబెట్టుకున్నారు.

  • Loading...

More Telugu News