: వారాంతాల్లో మాత్రమే నటిస్తా: స్మృతి ఇరానీ


ప్రముఖ నటి స్మృతి ఇరానీ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా బిజీ అయిపోయారు. ఉమేష్ శుక్లా దర్శకత్వంలో 'ఆల్ ఈజ్ వెల్' అనే చిత్రంలో నటించేందుకు ఎన్నికలకు ముందే ఆమె ఒప్పుకున్నారు. అయితే, మంత్రిగా ఆమె బిజీ అయిపోవడంతో ఈ చిత్రంలో నటించేందుకు ఆమెకు సమయం సరిపోవడం లేదు. ఆమె బిజీ షెడ్యూల్ ను అర్థం చేసుకున్న చిత్ర యూనిట్ కూడా... ఆమెకు వీలున్నప్పుడే షూటింగ్ లో పాల్గొనేందుకు అంగీకరించింది. ఈ క్రమంలో, వీకెండ్స్ లో షూటింగ్ లో పాల్గొనాలని ఆమె నిర్ణయించుకున్నారట. ఈ చిత్రంలో ఆమె అభిషేక్ బచ్చన్ తల్లి పాత్రలో నటిస్తున్నారు. ఆమె భర్తగా రిషి కపూర్ నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News