: షమీ స్థానంలో ఆరోన్ ను తీసుకోవాల్సింది: గంగూలీ
గాయపడిన యువ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో ముంబయి మీడియం పేసర్ ధవళ్ కులకర్ణిని ఎంపిక చేయడాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తప్పుబడుతున్నాడు. షమీ స్థానంలో జార్ఖండ్ స్పీడ్ స్టర్ వరుణ్ ఆరోన్ ను తీసుకోవాల్సిందన్నాడు. వన్డేలకు అవసరమైన పేస్ ఆరోన్ లో ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్ లోని ఫ్లాట్, డ్రై పిచ్ లపై ఆరోన్ ఎక్స్ ట్రా పేస్ లాభిస్తుందని వివరించాడు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఉమేశ్ యాదవ్ అమితవేగంగా బౌల్ చేస్తాడని, భువనేశ్వర్ బంతిని బాగా స్వింగ్ చేస్తాడని, వారికి తోడుగా ఆరోన్ ను ఎంపిక చేసి ఉంటే బాగుండేదని గంగూలీ అభిప్రాయపడ్డాడు.