: కేంద్ర హోం శాఖ వెబ్ సైట్లో తెలంగాణ రాష్ట్రం మిస్సయింది!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోం శాఖ తన వెబ్ సైట్లో కొత్త రాష్ట్రానికి చోటు కల్పించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విభజన జరిగి నెలలు గడుస్తున్నా తెలంగాణ రాష్ట్రం మాత్రం హోం శాఖ వెబ్ సైట్లో కనిపించడంలేదు. దీన్నిబట్టి చూస్తే, అసలు విభజన జరిగిందన్న విషయం హోం శాఖకు తెలియదని అనుకోవాలేమో! ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు విభాగాలున్నా.... హోం శాఖ వెబ్ సైట్లోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల జాబితాలో కానీ, మ్యాప్ లో కానీ తెలంగాణ లేదు. వెబ్ సైట్ లో సెర్చ్ చేస్తే 'నో రిజల్ట్స్' అనే సమాధానం వస్తుంది. కాగా, తెలంగాణ పోలీసు విభాగం ఇప్పటికీ ఏపీ పోలీసు వెబ్ సైట్ ద్వారానే సేవలు అందిస్తోంది.