: చిత్తూరు జిల్లాను మెడికల్ హబ్ గా మారుస్తాం: మంత్రి కామినేని
ఆథ్యాత్మిక శోభతో అలరారే చిత్తూరు జిల్లాను మెడికల్ హబ్ గా కూడా తీర్చిదిద్దుతామని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. చిత్తూరు జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలతో పాటు బోధనాసుపత్రులు కూడా రాబోతున్నాయని చెప్పారు. ప్రతి 80 వేల మందికి ఒక జనరిక్ మందుల దుకాణాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తిరుపతిలోని ఎస్టీవీ నగర్ లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వీధులను శుభ్రం చేశారు. ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమంతో భారత్ పరిశుభ్రమవుతుందని తెలిపారు.