: అరివీర భయంకరుడు మైక్ టైసన్ కూడా భయపడిపోయాడట!
మైక్ టైసన్... అభిమానులు మైక్ 'ఐరన్' టైసన్ అని గర్వంగా పిలుచుకుంటారు. హెవీ వెయిట్ బాక్సింగ్ రింగ్ లో కండలు తిరిగిన టైసన్ ముష్ఠిఘాతాలకు నేలకొరగని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అంతటి యోధుడైన టైసన్ కూడా ఒకసారి భయంతో బెదిరిపోయాడట. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు... న్యూయార్క్ వీధిలో వెళుతుండగా ఒక పెద్దాయన ఆపి... లైంగికంగా వేధించాడట. అప్పుడు చాలా భయపడ్డానని... ఆ తర్వాత ఆ వ్యక్తి ఎప్పుడూ కనపడలేదని టైసన్ వెల్లడించాడు. ఆ అనుభవం మాత్రం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు.