: సాఫ్ట్ వేర్ ఉద్యోగిని భరణి అదృశ్యం


మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ అత్తాపూర్ హుడా కాలనీకి చెందిన మోహన్ రావు కుమార్తె భరణి (26) బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. అక్టోబర్ 26వ తేదీన రాత్రి 9 గంటలకు ఎంజీబీఎస్ నుంచి ఆమె బెంగళూరు బయలు దేరింది. ఆమెను బస్సు ఎక్కించి ఇంటికి చేరుకున్న మోహన్ రావు... కుమార్తెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో, ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం భరణి పని చేస్తున్న కంపెనీకి ఫోన్ చేయగా... ఆమె రాలేదని సమాధానం వచ్చింది. దీంతో, హైదరాబాదులో ఉన్న వారితో పాటు బయట ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులను ఆరా తీశారు. అయినా భరణి ఆచూకీ తెలవలేదు. దీంతో, గురువారం రాత్రి తన కుమార్తె అచూకీ దొరకడం లేదంటూ అఫ్జల్ గంజ్ పీఎస్ లో మోహన్ రావు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News