: ఎక్కడున్నా వెంటనే లొంగిపోండి: భూమాకు జిల్లా ఎస్పీ వార్నింగ్
వైకాపా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో... ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో, భూమా ఇంట్లో జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చట్టాలను ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంట్లో భూమా లేరనే విషయం సోదాల్లో తేలిందని తెలిపారు. ఆయన ఎక్కడున్నా సరే వెంటనే పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావాలని మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నామని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతటి వారైనా ప్రజాస్వామ్య పద్ధతిలోనే నడుచుకోవాలని ఎస్పీ అన్నారు.