: దాసరికి వయసైపోయిందనే వారికి సమాధానమీ సినిమా: మోహన్ బాబు
దర్శకరత్న దాసరి నారాయణరావుకి వయసైపోయింది, ఇంకేం సినిమాలు తీస్తారు? అని చెప్పే చాలామందికి సమాధానమీ సినిమా అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలిపారు. 'ఎర్రబస్సు' ఆడియో విడుదలలో ఆయన మాట్లాడుతూ, వయసు ఎవరికి అయిపోదని ప్రశ్నించారు. వయసు పెరుగుతున్నా నిబద్ధతతో ఆయన అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసిన వ్యక్తి దాసరి అని మోహన్ బాబు తెలిపారు. ఆయన తెలుగు సినిమాలను నిర్మించి ఓ మార్క్ క్రియేట్ చేశారని తెలిపారు. ఆయన కొన్ని వందల సినీ ఇళ్లలో దీపం వెలిగించారని ఆయన చెప్పారు. వందేళ్లపాటు దాసరి ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.