: అంకుల్... ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేము!: విష్ణు


'అంకుల్... ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేమని' ప్రముఖ దర్శకుడు దాసరిని ఎర్రబస్సు హీరో మంచి విష్ణు కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు. 'ఎర్రబస్సు' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఆయన తమ కుటుంబానికి ఎంత చేశారో ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదని, ఏం చేసినా ఆయన రుణం తీరదని అన్నారు. తాను అమెరికాలో ఉండగా, 'ఒరే! నీకు మంచి గిఫ్టిస్తాను రా' అని పిలిచారని, తాను రాగానే షెడ్యూల్ మొదలు పెట్టారని తెలిపారు. ఆయనంత గొప్ప నటుడ్ని చూడలేదని విష్ణు తెలిపాడు.

  • Loading...

More Telugu News