: మీ పెంపుడు కుక్కతో మాట్లాడాలనుకుంటున్నారా?... అది సాధ్యమే!


మీ పెంపుడు కుక్కతో మాట్లాడాలనుకుంటున్నారా? అయితే ఇకపై మాట్లాడొచ్చు! దానిని సుసాధ్యం చేసే దిశగా పరిశోధనలు సాగించిన నార్త్ కరొలినా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాబర్ట్ ఫలితం సాధించారు. కుక్కల హావభావాలు, ప్రవర్తనను యజమానులు, యజమానుల ఆదేశాలను కుక్కలు అర్ధం చేసుకునేలా ఓ పరికరాన్ని తయారు చేశారు. ఈ పరికరం ద్వారా మనుషులకు, కుక్కలకు మధ్య సంభాషణ సాధ్యమేనని ఆయన వివరించారు. ప్రయోగాత్మకంగా దీనిని పరిశీలించామని, మంచి ఫలితాలు వచ్చాయని వారు తెలిపారు. అయితే దీనిలో చిన్న చిన్న మార్పులు ఉన్నాయని, వాటిని పూర్తి చేసి పరికరాన్ని మార్కెట్ లోకి విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News