: జంపు జిలానీలపై అనర్హత పిటిషన్: జానారెడ్డి
ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ నేతలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడం అనైతికమని తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాదులోని గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, ప్రజాసమస్యలను గాలికొదిలేసి, ప్రజాకాంక్షలను పట్టించుకోకుండా ఇతర పార్టీల నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారని అన్నారు. టీఆర్ఎస్ నేతలకు ప్రజలే గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రెండు మూడు రోజుల్లో జంపుజిలానీలపై అనర్హత పిటిషన్ దాఖలు చేస్తామని జానారెడ్డి స్పష్టం చేశారు.