: 'సింగం' కూడా ఓ జట్టును కొన్నాడు!


స్పోర్ట్స్ ఈవెంట్లలో బాలీవుడ్ తారల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతోంది. షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, ప్రీతీ జింటా, జుహీచావ్లా బాటలోనే 'సింగం' స్టార్ అజయ్ దేవగణ్ కూడా ఓ జట్టులో వాటాలు సొంతం చేసుకున్నాడు. ఇకపై, అజయ్ చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో ఢిల్లీ డ్రీమ్స్ సహ యజమానిగా వ్యవహరిస్తాడు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ డ్రీమ్స్ జట్టు లోగోను ఆవిష్కరించారు. అజయ్ దేవగణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోయినా, ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఢిల్లీ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తుండడాన్ని గర్వంగా భావిస్తున్నానని పేర్కొన్నాడు. తమ జట్టు ఇతర జట్లకు పీడకలలు మిగల్చడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News