: జార్ఖండ్ లో జేఎంఎంతో కాంగ్రెస్ కటీఫ్


ఇటీవలి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసేందుకు ఇష్టపడుతున్న కాంగ్రెస్, సంకీర్ణ పార్టీలతో బంధం తెంచుకుంటోంది. ఈ క్రమంలో త్వరలో జార్ఖండ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)తో తెగదెంపులు చేసుకుంది. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ బీకె హరిప్రసాద్ మాట్లాడుతూ, కేవలం ఆర్జే, జెడీ-యులతోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఈ రాష్ట్ర ఎన్నికలు నవంబర్ 25 నుంచి మొదలవుతాయి.

  • Loading...

More Telugu News