: రేపటి నుంచే ఉచిత ఏటీఎం లావాదేవీల్లో కోత
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనల మేరకు రేపటి (నవంబర్ 1) నుంచే ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్స్ (లావాదేవీలు)లో కోత పడనుంది. ఈ మేరకు, ఓ వ్యక్తి తను ఖాతా కలిగి ఉన్న బ్యాంకు ఏటీఎంలో నెలకు ఐదుసార్లు మాత్రమే ఉచితంగా నగదు తీసుకోవచ్చు. అంతకుమించితే ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ.20 ఛార్జీ కింద వసూలు చేస్తారు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో అయితే నెలకు మూడుసార్లు మాత్రమే ఎలాంటి ఛార్జీలు లేని లావాదేవీలు జరపవచ్చు. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ సిటీల్లో నూతన నిబంధనలు అమల్లోకి వస్తాయి.