: ముఖానికి 'ఒబామా మాస్క్' ధరించి దోపిడీకి పాల్పడ్డాడు!


అమెరికాలో ఓ దొంగ తన ముఖానికి 'బరాక్ ఒబామా మాస్క్' ధరించి దోపిడీకి పాల్పడ్డాడు (చూసినవాళ్ళు, సాక్షాత్తు అధ్యక్షుడు ఒబామానే దొంగతనానికి వచ్చాడని భావించాలన్నది అతడి ఉద్దేశం కావచ్చు). మసాచుసెట్స్ లో సాలెం పట్టణంలోని డన్కిన్ డోనట్స్ స్టోర్లో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. అతడు ధరించిన మాస్క్ అతడి ముఖ రూపురేఖలను పూర్తిగా దాచివేసింది. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో ఉన్న ఆ దుండగుడు క్యాషియర్ ను 'హర్రీ అప్' అనడం సీసీటీవీ ఫుటేజిలో వెల్లడైంది. నగదుతోపాటు తినుబండారాలను కూడా ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తోంది. దీనిపై, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముసుగు దొంగ ఇతర స్టోర్లలోనూ దోపిడీకి పాల్పడ్డాడా? అని కూడా పోలీసులు విచారిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేని, ముదురు ఆకుపచ్చ రంగు టయోటా కారులో అతడు కనిపించినట్టు తెలుస్తోంది. కాగా, ముఖానికి ప్రముఖ వ్యక్తుల ముసుగు ధరించి దోపిడీకి పాల్పడడం ఇదే ప్రథమం కాదు. ఇంతకుముందు, 2009లో ఓ వ్యక్తి మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మాస్క్ ధరించి కాలిఫోర్నియాలో రెండు బ్యాంకులను దోచుకున్నాడు.

  • Loading...

More Telugu News