: జిల్లా కలెక్టర్లతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై ఆయన కలెక్టర్లతో సమీక్షించారు. అర్హులందరికీ వృద్ధాప్య పింఛన్లు అందేలా చూడాలని ఆదేశించారు. ఎవరికైనా పింఛను అందకపోతే, రెండు నెలలకు కలిపి ఒకేసారి ఇవ్వాలన్నారు. పాలనలో ఆధునికతను వినియోగించుకోవాలని సూచించారు. జన్మభూమి-మన ఊరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. ప్రజలకు మేలు జరగాలన్న ఆశయంతో పనిచేయాలని ఉద్బోధించారు. సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు కావాలని బాబు కలెక్టర్లతో పేర్కొన్నారు.