: వైసీపీ నుంచి బయటపడటంతో, నరకం నుంచి విముక్తి లభించినట్లయింది: కొణతాల


వైసీపీ నుంచి బయటకు రావడంతో తనకు నరకం నుంచి విముక్తి లభించినట్లయిందని కొణతాల రామకృష్ణ వ్యాఖ్యానించారు. ''వైసీపీని చేజేతులా నాశనం చేసుకుంటున్న జగన్ ప్రవర్తన చూస్తుంటే నాకు ఆయనపై జాలి, దయ కలుగుతున్నాయి. నా రాజీనామాను వెంటనే ఆమోదించి, నాలుగేళ్ల నుంచి నేను అనుభవిస్తున్న నరకం నుంచి జగన్ నాకు విముక్తి కలిగించారు. దీనికి, ఆయనకు థ్యాంక్స్ చెప్పక తప్పదు'' అని ఆయన వ్యాఖ్యానించారు. కొణతాల రామకృష్ణ తన అనుచరులు, సన్నిహితులు, మీడియా మిత్రులతో నిన్న జరిపిన ప్రైవేటు సంభాషణలో పై వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News