: నేను స్వలింగ సంపర్కుడిని!: 'ఆపిల్' సీఈవో
కంప్యూటర్ రంగంలో ప్రసిద్ధిగాంచిన 'ఆపిల్' సంస్థ సీఈవో తాను స్వలింగ సంపర్కుడినని సంచలన ప్రకటన చేశారు. బ్లూమ్ బెర్గ్ బిజినెస్ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో తాను స్వలింగ సంపర్కినని చెప్పుకోవడానికి గర్విస్తున్నానని పేర్కొన్నారు. తన లింగత్వంపై వచ్చిన కథనాలను ఏనాడూ ఖండించలేదని, అలాగని తాను స్వలింగ సంపర్కినని బహిరంగ ప్రకటన చేయలేదని ఆయన వివరించారు. అయితే ఆపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తన విషయం తెలుసని ఆయన వెల్లడించారు. తన లింగ నిర్ధారణను బహిర్గతం చేయడం అంత సులువుగా జరగలేదని ఆయన చెప్పారు. అయితే తాను 'గే' అనే విషయం వెల్లడించడం ఆ రకమైన వర్గానికి ఉపయోగపడుతుందని భావించడంతో తాను స్వలింగ సంపర్కిననే విషయం వెల్లడిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడిచ్చిన వరంగా భావిస్తానని ఆయన తెలిపారు.