: యూపీఏకీ, ఎన్డీయేకి తేడా ఏంటి?...దొందూ దొందే!: సురవరం
నల్లధనం వెలికితీతలో యూపీఏ, ఎన్డీయే దొందూ దొందేనని, ఒకేలా ప్రవర్తిస్తున్నాయని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, యూపీఏ అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలనే ఎన్డీయే కూడా అనుసరిస్తోందని విమర్శించారు. నల్లధనం వెలికితీతపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. చట్టాల సాకుతో నల్లకుబేరులను కాపాడే యత్నం చేయడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. పీపీఏల పేరిట ప్రైవేటీకరణను తాను వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం నిధులలో కోత విధించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.