: ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఎమ్మెల్యే కారు బోల్తా


ఓ ప్రైవేటు బస్సు ఢీ కొనడంతో ఎమ్మెల్యే కారు బోల్తా పడింది. వివరాల్లోకెళితే... శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వాహనాన్ని గుండువిల్లిపేట సమీపంలో ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. ఆ సమయంలో ఎమ్మెల్యే కారులో లేరు. ఆయన ఎంపీతో పాటు మరో కారులో ప్రయాణిస్తున్నారు. దీంతో, ఆయనకు పెను ముప్పుతప్పింది. ఈ ప్రమాదంలో ఆయన అంగరక్షకుడు, వ్యక్తిగత కార్యదర్శి గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News