: తుపాను వేళ కూడా ప్రచారం కోసం పాకులాటే!: బాబుపై చిరంజీవి విమర్శలు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి విమర్శనాస్త్రాలు సంధించారు. హుదూద్ తుపాను సమయంలోనూ చంద్రబాబు ప్రచారం కోసం పాకులాడారని ఎద్దేవా చేశారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో బాబు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ, తుపాను వస్తుందన్న సూచనలను సర్కారు పట్టించుకోలేదని, అందుకే ప్రాణనష్టం జరిగిందని అన్నారు. ఇక, రాజధాని అంశంపైనా చిరంజీవి వ్యాఖ్యానించారు. పంటపొలాల్లో రాజధాని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భూసేకరణ అంశంలో రైతులను ఒప్పించాలే తప్ప, బలవంతం చేయరాదని అన్నారు. రైతులతో సున్నితంగా వ్యవహరించాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News