: టీఆర్ఎస్ లో చేరుతున్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
టీఆర్ఎస్ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' వలలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు పడ్డారు. వరంగల్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, చెవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే కవిత టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలసిన అనంతరం సచివాలయంలో మీడియాతో వారు ఈ విషయాన్ని ప్రకటించారు. కేసీఆర్ కు మద్దతుగా టీఆర్ఎస్ లో చేరుతున్నానని రెడ్యానాయక్ తెలిపారు. పేదలకు ఉపయోగపడే విధంగా ఆయన ప్రకటించిన పలు పథకాలు నచ్చే పార్టీలో చేరుతున్నానని చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. తనతో పాటు తన బలగమంతా టీఆర్ఎస్ లోకి వస్తుందని కూడా ఆయన తెలిపారు.