: కొత్త గాయకుల కోసం 'డిస్కవర్'
కొత్త గాయకులను ప్రోత్సహించేందుకు సిస్టమ్ శ్యామా టెలికాం లిమిటెడ్ సర్వీస్ ప్రొవైడర్ అయిన ఎంటీఎస్ 'డిస్కవర్' పేరిట సరికొత్త వేదికను ఏర్పాటు చేసింది. యువగాయకుల్లో దాగున్న సంగీత ప్రతిభ ఈ 'డిస్కవర్' ద్వారా బహిర్గతమవుతుందని ఆ సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. బకాడీ ఎన్ హెచ్7 తో కలసి వారాంతపు సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. లక్షలాది అభిమానుల ముందు యువసంగీత కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేలా చేయడమే తమ లక్ష్యమని ఎంటీఎస్ వెల్లడించింది.