: టీఆర్ఎస్ లో చేరిన తలసాని, తీగల
టీడీపీకి రాజీనామా చేసిన సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మరోనేత గంగాధర్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మీర్ పేటలోని తీగల కృష్ణారెడ్డి కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.