: ఫెదరర్ జట్టులో ఉన్నందుకు ఎగ్జైట్ అవుతున్నా: సానియా మీర్జా


డబ్ల్యూటిఏ టైటిల్ గెలుచుకుని దూకుడు మీదున్న టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా వచ్చే నెలలో ఐపీటీఎల్ (ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్)లో ఆడనుంది. ఇందులో స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టులో సానియా కూడా ఉంది. "గొప్ప టెన్నిస్ క్రీడాకారుడితో కలసి ఆడబోతుండటం చాలా బావుంది. ఫెదరర్ ఉన్న జట్టులో నేనుండటం పర్సనల్ గా చాలా ఎగ్జైట్ అవుతున్నా. దానికోసం ఎదురుచూస్తున్నా. ఐపీటీఎల్ చాలా గొప్ప ఫార్మాట్. ఇది విజయవంతం అవుతుందని ఆశిస్తున్నా" అని ఓ ఇంటర్వ్యూలో సానియా తెలిపింది.

  • Loading...

More Telugu News