: ఐసీఐసీఐ బ్యాంకుపై రూ.623 కోట్లకు ఎన్నారైల దావా!


భారత ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐపై ప్రవాస భారతీయులు భారీ పరిహారాన్ని డిమాండ్ చేస్తూ మారిషస్ కోర్టులో దావా వేశారు. ఐసీఐసీఐ వెంచర్ లో పెట్టిన తమ పెట్టుబడులకు ఆ బ్యాంకు తీవ్ర నష్టం వాటిల్లేలా వ్యవహరించిందని ఆరోపిస్తూ 69 మంది ప్రవాస భారతీయులు ఈ దావా వేశారు. తమకు రూ.623 కోట్ల మేర నష్టం వాటిల్లిందని పిటిషన్ లో పేర్కొన్న ఎన్నారైలు, అంతే మొత్తం పరిహారాన్ని ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎన్నారైల వాదనను ఐసీఐసీఐ తోసిపుచ్చింది. ఎన్నారైల పెట్టుబడులకు తామేమీ నష్టం కలిగించలేదని, దీనిపై న్యాయపరంగానే పోరు సాగిస్తామని బ్యాంకు యాజమాన్యం తెలిపింది.

  • Loading...

More Telugu News