: ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీని ఆహ్వానిస్తాం: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్
ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అతిపెద్ద పార్టీ ఆహ్వానించనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రకటించారు. బుధవారం మధ్యాహ్నం ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ చేస్తున్న యత్నాలు ఫలించనున్నాయి. అయితే ఢిల్లీలో తిరిగి ఎన్నికలు నిర్వహించాలన్న మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ నెరవేరే సూచనలు కనిపించడం లేదు. మెజార్టీ లేకున్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.