: కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందాం: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా చేపట్టే పథకాలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో, 26 ప్రభుత్వ శాఖల్లో ఆర్థిక వనరుల వినియోగంపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ పథకానికి, డిజిటల్ ఇండియా పథకానికి కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకుందామని సీఎం అధికారులతో అన్నారు. అలా కేంద్రం నుంచి రావల్సిన నిధుల్లో ఒక్కపైసా కూడా వృథా కాకుండా వినియోగించాలని చెప్పారు. ప్రతి ఊళ్లో రహదారి, డ్రైనేజి, తాగునీటి పథకాలను ప్రారంభించాలని, 'జన్మభూమి' పూర్తయ్యేలోపు ప్రతి ఊళ్లో చెత్త నిల్వ ప్రదేశం గుర్తించాలనీ అన్నారు. రూ.326 కోట్లతో ఆర్ డబ్య్లూఎస్ ప్రణాళిక సిద్ధం చేయాలని, రూ.150 కోట్లతో అటవీశాఖ ద్వారా జల వనరుల సంరక్షణ పనులు చేపట్టాలని పేర్కొన్నారు. మరోవైపు, పంచాయతీ రాజ్ శాఖకు తక్షణం రూ.800 కోట్లు విడుదల చేయాలని బాబు అధికారులను ఆదేశించారు.