: సీపీఐ ఏపీ కార్యదర్శికి ఆరు నెలల జైలు శిక్ష
సిపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి రామకృష్ణకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ వరంగల్ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. రామకృష్ణతో పాటు ఆ పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, రైతు సంఘం నేత విశ్వేశ్వరరావులకు కూడా ఇదే జైలు శిక్ష ఖరారు చేస్తూ వరంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. 2012లో వరంగల్ మార్కెట్ యార్డులో జరిగిన ధర్నాకు సంబంధించి పోలీసులు 12 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో ఆరుగురికి కోర్టు శిక్ష ఖరారు చేసింది.