: కృష్ణా జిల్లా జడ్పీ భేటీలో ఇసుక మాఫియాపై వాడీవేడీ చర్చ


కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో బుధవారం ఇసుక మాఫియాపై వాడీవేడీ చర్చ జరిగింది. సమావేశంలో భాగంగా ఇసుక మాఫియాకు కారణం మీరంటే, కాదు మీరంటూ అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుంది. సమావేశానికి హాజరైన రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ, ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక మాఫియా పేరిట పేదలపై వేధింపులను ఎంతమాత్రం సహించబోమని ఆయన వెల్లడించారు. ఇసుక మాఫియా ఆగడాలతో పాటు ఎస్సీ కార్పొరేషన్ రుణాల విషయంలోనూ అధికార, విపక్షాల మధ్య సంవాదం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News