: టీడీపీలో అవమానం జరిగింది... అందుకే వీడుతున్నా: తలసాని
పార్టీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నా... అందుకే పార్టీని వీడుతున్నా... జంప్ జిలానీలందరూ వల్లెవేసే మాట ఇదే. నిన్న కొణతాల కూడా ఇదే రకంగా బాధపడ్డారు. టీడీపీని వదిలి టీఆర్ఎస్ లో చేరుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇప్పుడు ఇదే చెప్పారు. పార్టీలో అవమానం జరిగింది... అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నానని తన అనుచరులతో తలసాని అన్నారు. ఒకవేళ తన గురించి చంద్రబాబు రాంగ్ గా మాట్లాడితే... ఆయన గురించి డైలీ సీరియల్ లా అనేక విషయాలు చెప్పాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఏ పార్టీలో ఉన్నా రాజకీయ నేతలంతా ఒకటే అని ఓటర్లు అనుకుంటూ ఉంటారు. వీళ్ల స్టేట్ మెంట్లు చూస్తే అదంతా నిజమే అనిపిస్తుంది కదూ!