: కేంద్రంతో టీఎస్ ప్రభుత్వానికి సత్సంబంధాలు లేకపోవడం దురదృష్టకరం: కోదండరాం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సంబంధాలు పెట్టుకుంటేనే లబ్ధి ఉంటుందన్న ఆయన... కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలు నెరపకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి ఏపీ పాలకులే కారణమని అన్నారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రా పాలకులు పట్టుకుపోయారని ఆరోపించారు.