: స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు... ఒకప్పుడు అమెరికాలో డిటర్జెంట్ పౌడర్ అమ్మారట!


ఆన్ లైన్ మార్కెటింగ్ వేదిక స్నాప్ డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్ బహల్ (31) ప్రస్థానం ఆసక్తిదాయకం. ప్రస్తుతం వరల్డ్ క్లాస్ సంస్థకు దిశా నిర్దేశం చేస్తున్న కునాల్ ఒకప్పుడు అమెరికాలో డిటర్జెంట్ పౌడర్ అమ్మారంటే ఆశ్చర్యం కలిగించకమానదు. యూఎస్ లో బిజినెస్ స్కూల్ విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన డిటర్జెంట్ పౌడర్ విక్రయించారట. కొందరితో కలిసి డిటర్జెంట్ పరిశ్రమ స్థాపించిన ఆయన, తన ఉత్పత్తులను స్వయంగా సూపర్ మార్కెట్లకు తీసుకెళ్ళేవారు. అటుపై, అనేక వ్యాపారాలు చేసిన కునాల్, రోహిత్ బన్సల్ తో కలిసి స్నాప్ డీల్.కామ్ ను స్థాపించి తిరుగులేని విజయాన్ని అందుకున్నారు.

  • Loading...

More Telugu News