: బెంగళూరు రైల్వే స్టేషన్ కు వై-ఫై సదుపాయం
దేశంలోనే వై-ఫై సదుపాయం కలిగిన తొలి రైల్వే స్టేషన్ గా బెంగళూరు స్టేషన్ అవతరించనుంది. ప్రయాణికులు ఈ స్టేషన్లో 30 నిమిషాలపాటు వారి మొబైల్ ఫోన్లపై ఉచితంగా వై-ఫై సేవలు అందుకోవచ్చు. ఆ తర్వాత కూడా వై-ఫై సదుపాయం పొందాలంటే స్టేషన్లోని వై-ఫై హెల్ప్ డెస్క్ నుంచి స్క్రాచ్ కార్డులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 30 నిమిషాల కార్డు ధర రూ.25 గానూ, 60 నిమిషాల కార్డు ధర రూ.35 గానూ నిర్ణయించారు. ఈ కార్డులు ఒకసారి కొన్న తర్వాత 24 గంటల్లోగా వినియోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవి చెల్లవని, క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా కూడా ఈ వై-ఫై కార్డులు కొనుగోలు చేయవచ్చని సీనియర్ రైల్వే అధికారి ఒకరు తెలిపారు.