: ఇసుక రీచ్ ల కేటాయింపులు... మహిళా సంఘాల మధ్య చిచ్చు పెట్టాయి!


ఆంధ్రప్రదేశ్ లో ఇసుక రీచ్ ల కేటాయింపులు స్వయం సహాయక సంఘాల మధ్య చిచ్చు పెట్టాయి. ఇసుక విక్రయాలను పారదర్శకంగా నిర్వహించాలని భావించిన చంద్రబాబు ప్రభుత్వం, రీచ్ లను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇసుక రవాణా, సీనరేజీ తదితరాల రేట్లను ఖరారు చేసిన ప్రభుత్వం రీచ్ ల కేటాయింపులకు సంబంధించి చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇసుక రీచ్ లను దక్కించుకున్న మహిళా సంఘాలు తమ కార్యకలాపాలను ప్రారంభించేశాయి. అయితే రీచ్ ల కేటాయింపుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికే ప్రాధాన్యం లభించిందని తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో మహిళలు ఆందోళనలకు దిగారు. మరో వైపు సీనియారిటీ ఉన్న తమకు కాదని వేరే సంఘానికి రీచ్ లను ఎలా కేటాయిస్తారని కొన్ని సంఘాలు అధికారులను నిలదీస్తుంటే, మరికొన్ని సంఘాలు రీచ్ లను దక్కించుకున్న సంఘాల సభ్యులతో బాహాబాహీకి దిగుతున్నాయి.

  • Loading...

More Telugu News