: క్యాన్సర్ ను గుర్తించే పిల్ పై గూగుల్ పరిశోధనలు


సెర్చ్ ఇంజిన్ జెయింట్ గూగుల్ తన పరిధిని మరింత విస్తరిస్తోంది. డ్రైవర్ రహిత కార్లు, నెట్ సౌకర్యాన్ని అందించే కళ్ళద్దాలు (గూగుల్ గ్లాస్), డ్రోన్లు (మానవరహిత విమానాలు)... ఇలా, అనేక రూపాల్లో పరిశోధనలు సాగిస్తోంది. తాజాగా, క్యాన్సర్ ను గుర్తించే పిల్ పై గూగుల్ దృష్టి సారించింది. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఈ పిల్ అయస్కాంత కణాలతో కూడి ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ప్రవేశించి, క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని చేతికి ధరించి ఉన్న ఓ సెన్సర్ కు చేరవేస్తుంది. గూగుల్ ఎక్స్ ల్యాబ్ లో దీనిపై పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును మంగళవారం ప్రకటించారు. ఈ పిల్ లో ఉండే అత్యంత సూక్ష్మకణాలు రక్తంలో ఉండిపోయి, అవి గుర్తించిన కణాల తాలూకు సమాచారాన్ని సంబంధింత డివైస్ కు పంపుతుంటాయి.

  • Loading...

More Telugu News