: రైతు బజార్ల తనిఖీల్లో ఏపీ మంత్రులు


రైతు బజార్లలోని అసౌకర్యాలను పారద్రోలేందుకు ఏపీ ప్రభుత్వం రంగంలోకి దిగినట్టుంది. ఒక్క పౌర సరఫరాల శాఖ మంత్రే కాక కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న పలు మంత్రులు రైతు బజార్ల తనిఖీలకు దిగుతున్నారు. ఇటీవల అనంతపురం రైతు బజార్ ను తనిఖీ చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, మార్కెట్ లోని సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏళ్లుగా కొనసాగుతున్న రైతు బజార్ లో ఇలాంటి పరిస్థితులున్నాయేమిటని కూడా ఆమె అధికారులపై మండిపడ్డారు. తాజాగా బుధవారం ఉదయం సునీతతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణ, పుల్లారావులు విశాఖలోని రైతు బజార్లను తనిఖీ చేశారు. ఆయా రైతు బజార్లలోని సౌకర్యాలపై లోతుగా దృష్టి సారించిన మంత్రులు త్వరలోనే సౌకర్యాల మెరుగుదలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

  • Loading...

More Telugu News