: కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్న 'టీఎన్జీవో'లు
కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజనలో అలసత్వం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. కేంద్రం తీరుకు నిరసనగా నవంబర్ 3న ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన కోరారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల్లో జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాలని ఆయన స్పష్టం చేశారు. క్యాడర్ స్ట్రెంగ్త్ ఆధారంగా ఉద్యోగుల విభజన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.