: కేసీఆర్ తీరుతోనే రాయల తెలంగాణ డిమాండ్ లేవనెత్తా: జేసీ


కేసీఆర్ తీరును గమనించే తాము రాయల తెలంగాణ డిమాండ్ లేవనెత్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా జలాలు సముద్రంలో కలిసిపోయినా ఫర్వాలేదు కానీ, రాయలసీమకు మాత్రం వెళ్లడానికి వీల్లేదనే లక్ష్యంతో కేసీఆర్ పని చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ఎండిపోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాయలసీమను సర్వనాశనం చేయడానికే కేసీఆర్ కంకణం కట్టుకున్నారని ఆయన ఆరోపించారు. కేవలం రాయలసీమను ఇక్కట్లపాలు చేసేందుకే కేసీఆర్ శ్రీశైలం వివాదం రాజేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా బోర్డుకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News