: రేపటిలోగా నల్ల కుబేరుల పేర్లు వెల్లడించాలి: సుప్రీంకోర్టు
నల్లధనం ఖాతాదారుల పేర్లతో కూడిన జాబితాను రేపటిలోగా తమకు తెలపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తమ తీర్పులో ఒక్క పదం కూడా మార్చేది లేదని స్పష్టం చేసింది. కాగా, నిన్న (సోమవారం) విదేశాల్లో అక్రమ ఖాతాలున్న ఎనిమిది మంది పేర్లను కేంద్రం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.