: జోధ్ పూర్ కోర్టుకు హాజరైన సోనాలీ బింద్రే, టబు, నీలం


బాలీవుడ్ నటులు సోనాలీ బింద్రే, టబు, నీలంతో పాటు మరికొంతమంది రాజస్థాన్ లోని జోధ్ పూర్ న్యాయస్థానానికి హాజరయ్యారు. 1998లో ఓ సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కృష్ణ జింకలను వేటాడారంటూ వీరిపై కేసు నమోదైంది. ఆ గ్రామంలోని ప్రజలు జింకలను పూజ్యనీయ ప్రాణులుగా భావిస్తారు. వాటికి హాని కలిగితే ఊరుకోరు. ఈ నేపథ్యంలో నటులపై కేసు నమోదు చేయడంతో న్యాయస్ధానం విచారణ చేపట్టింది. దీంతో, వీరంతా కోర్టుకు హాజరయ్యారు. వీరిని ఆ నాటి సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వారి ముందు హాజరుపరిచారు. జింకలను వేటాడిన బృందంలో సైఫ్ అలీఖాన్, సల్మాన్ ఖాన్ తో పాటు బింద్రే, నీలమ్, టబు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News